Share News

డేటా సెంటర్లలోకి రూ.16.44 లక్షల కోట్లు

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:04 AM

భారత్‌లో డేటా సెంటర్‌ రంగంలోకి 2021 నుంచి ఇప్పటి వరకు 173 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16.44 లక్షల కోట్ల) పెట్టుబడి హామీలు..

డేటా సెంటర్లలోకి రూ.16.44 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: భారత్‌లో డేటా సెంటర్‌ రంగంలోకి 2021 నుంచి ఇప్పటి వరకు 173 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16.44 లక్షల కోట్ల) పెట్టుబడి హామీలు వచ్చాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో డేటా సెంటర్ల స్థాపిత సామర్థ్యం 2 గిగావాట్లకు చేరుకునే అవకాశముందని తాజా నివేదికలో పేర్కొంది. కాగా ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశంలో కొత్తగా సుమారు 130 మెగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యం అందుబాటులోకి వచ్చిందని.. ద్వితీయార్ధంలో మరో 200 మెగావాట్లకు పైగా సామర్థ్యం అందుబాటులోకి రానుందని సీబీఆర్‌ఈ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 01:04 AM