3 నెలల కనిష్ఠానికి కీలక రంగాల వృద్ధి
ABN , Publish Date - Sep 22 , 2026 | 05:11 AM
తొమ్మిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తిలో వృద్ధి మూడు నెలల కనిష్ఠానికి తగ్గిం ది. ఆగస్టు నెలలో 4.8 శాతంగా నమోదైంది. బొగ్గు, సహజ వాయువు, ముడి చమురు...
న్యూఢిల్లీ: తొమ్మిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తిలో వృద్ధి మూడు నెలల కనిష్ఠానికి తగ్గిం ది. ఆగస్టు నెలలో 4.8 శాతంగా నమోదైంది. బొగ్గు, సహజ వాయువు, ముడి చమురు, ఎరువుల ఉత్పత్తిలో తగ్గుదల ఇందుకు కారణమైనట్టు సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇంతకు ముందు మే నెలలో 3.2 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది ఆగస్టులో మౌలిక రంగాల ఉత్పత్తిలో వృద్ధి 6.2 శాతం ఉండగా.. ఈ ఏడాది జూలైలో వృద్ధి 5 శాతంగా ఉంది. ఆగస్టులో బొగ్గు, సహ జ వాయువు, ముడి చమురు, ఎరువుల ఉత్పత్తి వరుసగా 3.8 శాతం, 4.9 శాతం, 3.6 శాతం, 12.4 శాతం తగ్గింది. కాగా రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తిలో వృద్ధి రేటు ఆగస్టులో 2.6 శాతం, ఉక్కు రంగంలో 3.4 శాతం, ఇనుప ఖనిజంలో 5.5 శాతంగా నమోదైంది.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..