రూ.2 లక్షల కోట్లు వంట నూనెల దిగుమతుల బిల్లు
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:37 AM
ఈ అక్టోబరుతో ముగిసిన ఆయిల్ సంవత్సరం(2025-26)లో వంట నూనెల దిగుమతులు 6 శాతం పెరిగి 1.692 కోట్ల టన్నులకు చేరాయి...
న్యూఢిల్లీ: ఈ అక్టోబరుతో ముగిసిన ఆయిల్ సంవత్సరం(2025-26)లో వంట నూనెల దిగుమతులు 6 శాతం పెరిగి 1.692 కోట్ల టన్నులకు చేరాయి. దీంతో దిగుమతి బిల్లు 24 శాతం పెరిగి దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరుకుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) సోమవారం వెల్లడించింది. క్రితం ఆయిల్ సంవత్సరంలో వంట నూనెల దిగుమతులు 1.601 కోట్ల టన్నులు ఉండగా.. దిగుమతుల బిల్లు దాదాపు రూ.1,61,126 కోట్లుగా ఉందని పేర్కొంది. వంట నూనెయేతర సహా మొత్తం వెజిటేబుల్ ఆయిల్ దిగుమతులు 5 శాతం పెరిగి 1.724 కోట్ల టన్నులకు చేరాయి.
ఇవీ చదవండి
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!