లిథియం-అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్ ఎగుమతులపై నిషేధం
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:36 AM
లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి లభించే బ్లాక్ మాస్ ఎగుమతులను నిషేధిస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది...
న్యూఢిల్లీ: లిథియం-అయాన్ బ్యాటరీల నుంచి లభించే బ్లాక్ మాస్ ఎగుమతులను నిషేధిస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా రీసైక్లింగ్‌తోపాటు కీలక ఖనిజాల రికవరీని బలోపేతం చేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాలం చెల్లిన లిథియం-అయాన్ బ్యాటరీలు, బ్యాటరీ తయారీ వ్యర్థాలను ముక్కలుగా చేసినప్పుడు లభించే పొడి పదార్థాన్ని బ్లాక్ మాస్‌గా పిలుస్తారు. ఇందులో లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. ఎలక్ర్టిక్ వాహనాలు, అధునాతన కెమిస్ర్టీ సెల్ బ్యాటరీలు, విద్యుత్ నిల్వ, ఎలక్ర్టానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాలకు ఈ ఖనిజాలు ముఖ్యమైన ముడిపదార్థాలు. వీటిలో చాలా వాటి కోసం మన దేశం దిగుమతులపై ఆధారపడుతోంది. బ్యాటరీ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా ఈ ఖనిజాల సరఫరాను పెంచుకోవచ్చని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!
కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?