జోరు మీదున్న బ్యాంకింగ్ రంగం
ABN , Publish Date - Apr 20 , 2026 | 02:08 AM
దేశీయ బ్యాంకింగ్ రంగం మంచి జోరు మీద ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఈ ఏడాది జూన్ వరకు బ్యాంకింగ్ రంగానికి...
ఫిక్కీ-ఐబీఏ సర్వే వెల్లడి
అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నా బేఫికర్
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగం మంచి జోరు మీద ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఈ ఏడాది జూన్ వరకు బ్యాంకింగ్ రంగానికి ఎలాంటి ఢోకా లేదని ఫిక్కీ-ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. ఈ కాలంలో భారతీయ బ్యాంకుల పారిశ్రామిక రుణ వితరణ 11 నుంచి 13 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య కాలంలో దేశంలోని 24 ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకుల ప్రధాన అధికారులతో చర్చించి ఫిక్కీ-ఐబీఏ ఈ సర్వే రూపొందించాయి. ఈ ఆరు నెలల్లో దేశీయ బ్యాంకింగ్ రంగానికి ఈ అంశాలు కలిసి వస్తాయని సర్వే పేర్కొంది.
పటిష్ఠంగా ఉన్న బ్యాంకుల ఆస్తి-అప్పుల పట్టీలు
వ్యవస్థలోని పలు రంగాల్లో కొనసాగుతున్న వృద్ధి రేటు
రిటైల్, ఎస్‌ఎంఈల నుంచి రుణాలకు డిమాండ్
మౌలిక, ఆటో, ఆటోమొబైల్ విడిభాగాలు, ఫార్మా, రియల్టీ, తయారీ, డేటా కేంద్రాలు, రక్షణ రంగాల కంపెనీల నుంచి టర్మ్ రుణాలకు పెరుగుతున్న డిమాండ్
పెరుగుతున్న ప్రభుత్వ పెట్టుబడులు, వ్యయాలు
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో