జూన్‌లో ఆటో జోరు
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:48 AM
దేశీయంగా జూన్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు దాదాపు 25 శాతం పెరిగి సుమారు 4 లక్షలకు చేరుకున్నాయి. మారుతి సుజుకీ, టాటా మోటార్స్ పీవీ, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో...
న్యూఢిల్లీ: దేశీయంగా జూన్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు దాదాపు 25 శాతం పెరిగి సుమారు 4 లక్షలకు చేరుకున్నాయి. మారుతి సుజుకీ, టాటా మోటార్స్ పీవీ, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో మంచి వృద్ధి ఇందుకు దోహదపడింది. మారుతి సుజుకీ జూన్‌లో మొత్తం 2,00,390 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోల్చితే వృద్ధి 19.3 శాతం ఉంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ మొత్తం అమ్మకాలు జూన్‌లో 69 శాతం పెరిగి 37,237 నుంచి 63,083కు ఎగబాకాయి. మహీంద్రా మొత్తం అమ్మకాలు గత ఏడాది జూన్‌తో పోల్చితే 37 శాతం వృద్ధితో 1,06,207కు చేరాయి. హ్యుండయ్ మోటార్ మొత్తం 51,335 కార్లను విక్రయించింది. కియా ఇండియా జూన్‌లో 24,552 కార్లు విక్రయించగా.. టయోటా కిర్లోస్కర్ మోటార్ గత నెలలో 31,016 వాహనాలను విక్రయించింది. జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ జూన్‌లో వార్షిక ప్రాతిపదికన 30 శాతం వృద్ధితో 7,568 కార్ల విక్రయాలను నమోదు చేసింది. నిస్సాన్ మోటార్ ఇండియా మొత్తం విక్రయాలు గత నెలలో 16 శాతం పెరిగి 8,346కు చేరాయి. కాగా, హీరో మోటోకార్ప్ గత నెలలో 5,41,159 వాహనాలను విక్రయించగా.. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ మొత్తం 5,28,281 వాహనాలను విక్రయించింది.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News And Telangana News And National News