వాహనాల రిటైల్ అమ్మకాల్లో 9.55 శాతం వృద్ధి: ఫాడా
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:48 AM
శంలో ఆటోమొబైల్ రిటైల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మే నెలలో ఈ అమ్మకాలు 9.55 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 25,31,067 యూనిట్లకు చేరుకున్నాయని...
న్యూఢిల్లీ: దేశంలో ఆటోమొబైల్ రిటైల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మే నెలలో ఈ అమ్మకాలు 9.55 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 25,31,067 యూనిట్లకు చేరుకున్నాయని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ల సమాఖ్య (ఫాడా) సోమవారం వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయాలు 23,10,451 యూనిట్లుగా ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో గత నెలలో ఇంధన ధరలు పెరగడంతో ఇంధన సామర్థ్యం, పర్యావరణ అనుకూల వాహనాలకు సంబంధించి డీలర్ల వద్ద ఎంక్వైరీలు పెరిగినట్టు ఫాడా తెలిపింది. ఈ నేపథ్యంలో మొదటిసారిగా ఎలక్ర్టిక్ వాహనాల (ఈవీ) వాటా 11 ఽశాతాన్ని దాటినట్టు పేర్కొంది. వాణిజ్య వాహనాలు (సీవీ), ప్రయాణికుల వాహనాలు (పీవీ), మొత్తం ఈవీల వాటా మే నెలలో అత్యుత్తమ పనితీరును ప్రతిబింబిస్తున్నదని ఫాడా తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest, Telangana News And National News