Share News

2040 నాటికి 700 గిగావాట్ల ఏసీసీ బ్యాటరీలకు డిమాండ్‌

ABN , Publish Date - Feb 06 , 2026 | 05:02 AM

దేశం లో అడ్వాన్స్‌డ్‌ కెమిస్ర్టీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీల డిమాండ్‌ 2040 నాటికి 700 గిగావాట్లకు పెరగనుంది. ప్రస్తుత డిమాండ్‌ 28 జీడబ్ల్యూహెచ్‌ ఉంది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ అలయెన్స్‌...

2040 నాటికి 700 గిగావాట్ల ఏసీసీ బ్యాటరీలకు డిమాండ్‌

ఐఈఎస్ఏ అంచనా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశం లో అడ్వాన్స్‌డ్‌ కెమిస్ర్టీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీల డిమాండ్‌ 2040 నాటికి 700 గిగావాట్లకు పెరగనుంది. ప్రస్తుత డిమాండ్‌ 28 జీడబ్ల్యూహెచ్‌ ఉంది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ అలయెన్స్‌ (ఐఈఎస్ఏ) గురువారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఐఈఎ్‌సఏ రెండు రోజుల పాటు నిర్వహించిన ఇండియా బ్యాటరీ తయారీ, సరఫరా వ్యవస్థ శిఖరాగ్ర సదస్సులో (ఐబీఎంఎ్‌ససీఎస్‌) ఈ నివేదిక విడుదల చేశారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించాలన్న లక్ష్యాన్ని చేరే ప్రయత్నంలో ఉన్న భారత్‌ తాను ప్రకటించిన వాతావరణ కట్టుబాట్లను నెరవేర్చాలంటే విద్యుత్‌ మొబిలిటీలోకి మారడం, భారీ ఎత్తున ఇంధన నిల్వ వసతులు అందుబాటులో ఉంచడం కీలకమని ఆ నివేదిక పేర్కొంది. ఈ సందర్భంగా పునరుత్పాతక ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజేష్‌ కుల్హరి మాట్లాడుతూ.. బ్యాటరీ తయారీ, స్టోరేజి విభాగంలో భారీ ఎత్తున సహకార భాగస్వామ్యాలు ఏర్పడాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం బ్యాటరీ ఉత్పత్తిదారులు, ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకరమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నదని తెలంగాణ ఐటీఈసీ డైరెక్టర్‌ ఎస్‌కే శర్మ అన్నారు. చైనా, జపాన్‌, కొరియా, ఫిన్లాండ్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 06 , 2026 | 05:02 AM