Share News

ఇన్‌క్యూస్పేజ్‌ చేతికి ‘ఐకెవా’

ABN , Publish Date - Jun 09 , 2026 | 02:39 AM

రియల్టీ కంపెనీ ఇన్‌క్యూస్పేజ్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో...

ఇన్‌క్యూస్పేజ్‌ చేతికి ‘ఐకెవా’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రియల్టీ కంపెనీ ఇన్‌క్యూస్పేజ్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో కోవర్కింగ్‌ సేవలు అందించే ‘ఐకెవా’ కంపెనీని కొనుగోలు చేసింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందనేది మాత్రం ఇన్‌క్యూస్పేజ్‌ వెల్లడించలేదు. అయితే ఈ కొనుగోలు ద్వారా ఏటా అదనంగా రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపింది. ఇన్‌క్యూస్పేజ్‌ ప్రస్తుతం దేశంలోని 18 నగరాల్లో 50 చోట్ల 40 లక్షల చదరపు అడుగులకు పైగా కోవర్కింగ్‌ స్పేస్‌ను సబ్‌లీజుకు ఇచ్చింది. ఐకెవా కొనుగోలుతో మరో ఐదు లక్షల ఎస్‌ఎ్‌ఫటీ కో వర్కింగ్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు

16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల

Read AP News Latest, Telangana News  And National News

Updated Date - Jun 09 , 2026 | 02:39 AM