Share News

హైదరాబాద్‌లో ఐహెచ్‌సీఎల్‌ గేట్‌వే హోటల్‌

ABN , Publish Date - Mar 13 , 2026 | 02:19 AM

ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) హైదరాబాద్‌లోని సోమాజీగూడలో గేట్‌వే హోటల్‌ ఏర్పాటు చేయనుంది...

హైదరాబాద్‌లో ఐహెచ్‌సీఎల్‌ గేట్‌వే హోటల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) హైదరాబాద్‌లోని సోమాజీగూడలో గేట్‌వే హోటల్‌ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆంత్రప్రెన్యూర్లు డీ శివరామరాజు, డీవీఎస్‌ సోమరాజులతో కాంట్రాక్టుపై సంతకాలు చేసినట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో గేట్‌వే బ్రాండ్‌ 50 హోటళ్ల మైలురాయిని చేరుతుందని ఐహెచ్‌సీఎల్‌ గేట్‌వే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ బ్రాండ్‌ లీడర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ లే టాటా చెప్పారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పని చేస్తున్న హోటల్‌కు గేట్‌వే బ్రాండింగ్‌ ఇవ్వడమేనని తెలిపారు. 225 గదులుండే ఈ హోటల్‌లో రెస్టారెంట్‌, స్పెషాలిటీ రెస్టారెంట్‌, బార్‌ వంటి వసతులుంటాయి. గేట్‌వే బ్రాండ్‌ హోటల్‌ ఏర్పాటుతో తెలంగాణలో ఐహెచ్‌సీఎల్‌ హోటళ్ల సంఖ్య 8కి చేరుతుంది.

ఇవి కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 13 , 2026 | 02:19 AM