ఐడీఎఫ్‌సీ బ్యాంక్ లాభం రూ.1,075 కోట్లు
ABN , Publish Date - Jul 26 , 2026 | 03:33 AM
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.1,075 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన...
న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్.. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.1,075 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ. 463 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 132.4 శాతం అధికం. కాగా ఇది బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభమని, రుణాల పంపిణీలో వృద్ధి, వడ్డీ ఆదాయం మెరుగుపడటం, మొండిబకాయిలు తగ్గడం.. ఈ వృద్ధికి ప్రధాన కారణమని తెలిపింది. కాగా సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం వ్యాపారం 18.6 శాతం వృద్ధితో రూ.5,10,031 కోట్ల నుంచి రూ.6,04,776 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఎ) 1.97 శాతం నుంచి 1.51 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.55 శాతం నుంచి 0.44 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్ 5.71 శాతం నుంచి 5.96 శాతానికి మెరుగుపడింది.
ఈ వార్తలు కూడా చదవండి:
కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ