Share News

24 శాతం తగ్గిన హ్యుండయ్‌ లాభం

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:37 AM

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన...

24 శాతం తగ్గిన హ్యుండయ్‌ లాభం

న్యూఢిల్లీ: హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌).. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,196.16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.1,572.25 కోట్లతో పోల్చితే 24 శాతం క్షీణించింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.17,460.82 కోట్ల నుంచి రూ.20,696.05 కోట్లకు పెరిగింది. కాగా మెటీరియల్‌ ధరలు పెరగటంతో ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ.15,566.06 కోట్ల నుంచి రూ.19,302.18 కోట్లకు పెరిగినట్లు కంపెనీ ఎండీ, సీఈఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. అయితే ఒక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం తొలిసారిగా రూ.20,000 కోట్ల మార్కును అధిగమించిందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 2,19,072 యూనిట్లను విక్రయించటమే ఇందుకు కారణమని గార్గ్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:37 AM