Share News

గ్రామీణ మార్కెట్‌పై హ్యుండయ్‌ ఫోకస్‌

ABN , Publish Date - Sep 07 , 2026 | 02:47 AM

గ్రామీణ ప్రాంతాలపై హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మరింత దృష్టి సారిస్తోంది

గ్రామీణ మార్కెట్‌పై హ్యుండయ్‌ ఫోకస్‌

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాలపై హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మరింత దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో తమ మొత్తం వాహన విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ల వాటాను 30 శాతానికి పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో గ్రామీణ మార్కెట్ల వాటా 25.9 శాతానికి చేరుకుందని హెచ్‌ఎంఐఎల్‌ ఎండీ, సీఈఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. కంపెనీ ప్రారంభిస్తున్న ప్రతి 10 అవుట్‌లెట్లలో 6 గ్రామీణ మార్కెట్లలోనే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Sep 07 , 2026 | 02:47 AM