Share News

రాయదుర్గంలో వంశీరామ్‌ ఐటీ పార్క్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:31 AM

హైదరాబాద్‌, రాయదుర్గంలో.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వంశీరామ్‌ బిల్డర్స్‌ 30 అంతస్తులతో ప్రత్యేక ఐటీ పార్కు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆ ప్రాంతంలో...

రాయదుర్గంలో వంశీరామ్‌ ఐటీ పార్క్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌, రాయదుర్గంలో.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వంశీరామ్‌ బిల్డర్స్‌ 30 అంతస్తులతో ప్రత్యేక ఐటీ పార్కు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆ ప్రాంతంలో ప్రభుత్వం నుంచి రూ.1,040 కోట్లతో 5.09 ఎకరాల భూమిని ఈ-వేలంలో కొనుగోలు చేసింది. ఈ భూమికి ప్రభుత్వం ఎకరానికి రూ.139 కోట్ల కనీస వేలం ధరగా నిర్ణయించగా వంశీరామ్‌ బిల్డర్స్‌ 46.76 శాతం ప్రీమియంతో ఎకరా రూ.204 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ సమీపంలోని ఈ 5.09 ఎకరాల్లో 20 లక్షల చదరపు అడుగుల బిల్టప్‌ విస్తీర్ణంతో ఈ ఐటీ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్టు వంశీరామ్‌ బిల్డర్స్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

114 రఫేల్స్‌ కావాలి!

Updated Date - Jun 04 , 2026 | 01:31 AM