Share News

హైదరాబాద్‌లో రేర్‌ఎర్త్‌ మాగ్నెట్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:59 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మిడ్‌వెస్ట్‌ ఎనర్జీ.. దేశంలోనే తొలి నియోడైమియం ఐరన్‌ బోరన్‌ (ఎన్‌డీఎ్‌ఫఈబీ) మాగ్నెట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది....

హైదరాబాద్‌లో రేర్‌ఎర్త్‌ మాగ్నెట్‌ ప్లాంట్‌

  • రూ.250 కోట్ల పెట్టుబడి: మిడ్‌వెస్ట్‌ ఎనర్జీ

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మిడ్‌వెస్ట్‌ ఎనర్జీ.. దేశంలోనే తొలి నియోడైమియం ఐరన్‌ బోరన్‌ (ఎన్‌డీఎ్‌ఫఈబీ) మాగ్నెట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ అక్టోబరు ద్వితీయార్థం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 500 మెట్రిక్‌ టన్నులు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మోటార్స్‌, విండ్‌ టర్బైన్స్‌, స్మార్ట్‌ఫోన్స్‌, ఢిఫెన్స్‌ అప్లికేషన్స్‌తో పాటు ఎంఆర్‌ఐ ఎక్వి్‌పమెంట్‌ కోసం అవసరమైన మాగ్నెట్లను ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌ ఈ ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మిడ్‌వెస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌తో.. వచ్చే ఐదేళ్లలో ఈ మాగ్నెట్‌ దిగుమతులు 15-20 శాతం వరకు తగ్గొచ్చని అంచనా. కాగా 2027 డిసెంబరు నాటికి మరో రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 5,000 టన్నులకు పెంచాలని కంపెనీ భావిస్తోంది. మరోవైపు కంపెనీ క్లీన్‌ ఎనర్జీ విభాగమైన మిడ్‌వెస్ట్‌ బిజినెస్‌.. ఈ ఏడాది జూలైలో బెంగళూరులో 1.2 గిగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ ప్లాంట్‌ను ప్రారంభించింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 03:59 AM