డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:33 AM
హైదరాబాద్ స్వరూపం మారిపోతోంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు సైతం తమ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ స్వరూపం మారిపోతోంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలు సైతం తమ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఏర్పాటైన డేటా సెంటర్ల సామర్థ్యం 2022లో 60.9 మెగావాట్లు ఉండగా గత ఏడాది చివరికి 151.4 మెగావాట్లకు చేరిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. దీనికి తోడు మరో 1,900 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ల ఏర్పాటు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. దేశంలో ముంబై తర్వాత ఒక్క హైదరాబాద్‌లోనే కొత్తగా ఇంత సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు కొత్తగా ఏర్పాటవుతున్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం