GMR Hyderabad Airside Reefer Truck: హైదరాబాద్ విమానాశ్రయంలో ఎయిర్‌సైడ్ రీఫర్ ట్రక్
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:44 AM
శీతలీకరించిన కార్గో రవాణాకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): శీతలీకరించిన కార్గో రవాణాకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం ఎయిర్‌సైడ్ రీఫర్ ట్రక్‌ను ప్రవేశపెట్టింది. దేశంలో ఇలాంటి ట్రక్ సర్వీసు ప్రారంభించడం ఇదే ప్రథమం. ఉష్ణోగ్రతల ప్రభావానికి తీవ్రంగా గురయ్యే వస్తువులను కార్గో టెర్మినల్ నుంచి విమానంలోకి తరలించే క్రమంలో చల్లదనం నష్టపోకుండా చూసేందుకు ఈ ట్రక్ ఉపయోగపడుతుందని జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలోకి వస్తువులను తరలించే క్రమంలో +2 డిగ్రీల నుంచి +25 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు ఉండేలా అది జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొంది. ఫలితంగా ఫార్మాస్యూటికల్స్, తాజా పళ్లు, కూరగాయలు, పూలు, సముద్రపు ఉత్పత్తులు, డెయిరీ ఉత్పత్తులు, మాంసం, త్వరగా చెడిపోయే స్వభా వం గల ఇతర వస్తువుల నాణ్యత దెబ్బ తినకుండా ఇది కాపాడుతుందని సీఈఓ ప్రదీప్ పణిక్కర్ అన్నారు.
ఇవీ చదవండి:
అల్ ఫలా వర్సిటీ క్యాంపస్ అటాచ్!
వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!