హైదరాబాద్-యూరప్ మధ్య కార్గో కనెక్టివిటీ
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:47 AM
జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్‌ఐఏఎల్), బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్ట్‌తో...
జీహెచ్‌ఐఏఎల్, బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్ట్ ఒప్పందం
శంషాబాద్ రూరల్ (ఆంధ్రజ్యోతి): జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్‌ఐఏఎల్), బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా హైదరాబాద్-యూరప్ మధ్య ఎయిర్ కార్గో కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటు సరుకు రవాణా (కార్గో)లో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాల కోసం కలిసి పనిచేయనున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్, బ్రస్సెల్స్ మధ్య కార్గో సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేయటం, యూరప్ దేశాల మధ్య కార్గో రవాణా, వాణిజ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నాయి. అలాగే యూర్‌పలోని కీలక మార్కెట్లను హైదరాబాద్‌తో అనుసంధానం చేసేందుకు గల అవకాశాలను గుర్తించటంపై జీహెచ్‌ఐఏఎల్, బ్రస్సెల్స్ విమానాశ్రయం ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి.
ఈ వార్తలనూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్