Share News

హెచ్‌యూఎల్‌ లాభం రూ.2,796 కోట్లు

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:34 AM

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌).. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో...

హెచ్‌యూఎల్‌ లాభం రూ.2,796 కోట్లు

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌).. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.2,796 కోట్ల కన్సాలిడేట్‌ నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,791 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా పెరిగింది. గత ఏడాది లాభాల్లో ఒకేసారి వచ్చిన పన్ను మినహాయింపు రూ.273 కోట్ల మేర ఉండడంతో ఈసారి నికర లాభాల్లో పెద్దగా మార్పు లేదని తెలిపింది. కాగా సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 14.44 శాతం వృద్ధితో రూ. 18,386 కోట్లకు చేరుకుంది. ఇందులో ఉత్పత్తుల విక్రయాల ఆదాయం 14.77 శాతం వృద్ధితో రూ.15,715 కోట్ల నుంచి రూ.18,037 కోట్లకు పెరిగింది.

ఇవి కూడా చదవండి...

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:34 AM