ఆంథ్రోపిక్ మరో సంచలనం.. ఒక్క పోస్ట్‌తో వందల కోట్ల రూపాయలు ఆవిరి..
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:27 PM
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. ఆమెరికాకు చెందిన ఈ సంస్థ ఇప్పటికే ఐటీ సంస్థలకు చుక్కలు చూపించింది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్‌లు అందించే కంపెనీలకు షాకిచ్చింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. ఆమెరికాకు చెందిన ఈ సంస్థ ఇప్పటికే ఐటీ సంస్థలకు చుక్కలు చూపించింది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్‌లు అందించే కంపెనీలకు షాకిచ్చింది. కొన్ని గంటల క్రితం ఆంథ్రోపిక్ చేసిన ఒక్క పోస్ట్ పది బిలియన్ డాలర్ల నష్టాన్ని తీసుకొచ్చింది. అమెరికా స్టాక్ మార్కెట్‌లో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు కుప్పకూలాయి (Anthropic Claude Code).
సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ 'క్లాడ్ కోడ్ సెక్యూరిటీ' తీసుకొస్తున్నట్టు ఆంథ్రోపిక్ ప్రకటించింది. ఇది సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేసి, అందులోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దే పరిష్కారాలను సిఫారసు చేస్తుంది. దాంతో కోడింగ్ సమయంలోనే డెవలపర్లు భదత్రా పరమైన లోపాలను గుర్తించి పరిష్కరించుకోవచ్చు. సాంప్రదాయబద్దంగా గుర్తించలేని లోపాలను కూడా ఈ టూల్ ద్వారా సులభంగా కనిపెట్టవచ్చని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని, త్వరలోనే అందుబాటులోకి రావొచ్చని ఒక పోస్ట్ చేసింది (AI software security).
ఈ పోస్ట్‌తో అమెరికా స్టాక్ మార్కెట్‌లోని సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు షేకయ్యాయి (Claude AI cybersecurity). క్రౌడ్‌స్ట్రైక్, క్లాడ్‌ఫ్లేర్, స్కేలార్, సెయిల్ పాయింట్, ఓక్టా తదితర సంస్థల షేర్లు 5 నుంచి పది శాతం మేర పడిపోయాయి. సైబర్ సెక్యూరిటీతో సంబంధం ఉన్న ఐటీ షేర్లు కూడా పడిపోయాయి. అలాగే గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ 5 శాతం నష్టపోయింది. మొత్తానికి ఆంథ్రోపిక్ చేసిన ఒక్క పోస్ట్ కారణంగా పది బిలియన్ డాలర్ల మేర ఆవిరైంది.
ఇవి కూడా చదవండి..
ఇదెక్కడి పిచ్చి బ్రదర్.. రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడతారా..
మీ కళ్ల షార్ప్‌నెస్‌కు టెస్ట్.. ఈ పార్క్‌లో పుస్తకం ఎక్కడుందో 13 సెకెన్లలో గుర్తించండి..