60 లక్షల యూనిట్ల విక్రయ లక్ష్యం
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:01 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో తమ విక్రయాల పరిమాణం 60 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) అంచనా...
హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఇండియా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో తమ విక్రయాల పరిమాణం 60 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 57.5 లక్షల యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఈసారి విక్రయాలు 4.3ు పెరిగే అవకాశముందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సుట్సుము ఒటాని తెలిపారు. నవరాత్రి పండగ సీజన్ ప్రారంభంతో దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో డిమాండ్ బలంగా ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే హోండా దేశీయ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 13.5ు పెరిగి 30.4 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. కంపెనీ మార్కెట్ వాటా 25 శాతంగా నమోదైనట్లు ఒటాని తెలిపారు. హోండా మొత్తం విక్రయాల్లో దాదాపు 60ు వాటా స్కూటర్ల విభాగం నుంచే వస్తోందని చెప్పారు. కాగా ప్రస్తుతం ఉన్న 65 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 2028 నాటికి 80 లక్షల యూనిట్లకు పెంచాలని హెచ్ఎంఎస్ఐ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ