Share News

హోండా మోటార్‌సైకిల్‌.. 10 కొత్త మోడళ్లు

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:04 AM

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో మరింత పట్టును చేజిక్కించుకునే లక్ష్యంతో హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ (హెచ్‌ఎంఎ్‌సఐ).. 10 కొత్త మోడళ్లను విడుదల చేసింది....

హోండా మోటార్‌సైకిల్‌..  10 కొత్త మోడళ్లు

న్యూఢిల్లీ: భారత ద్విచక్ర వాహన మార్కెట్లో మరింత పట్టును చేజిక్కించుకునే లక్ష్యంతో హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ (హెచ్‌ఎంఎ్‌సఐ).. 10 కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఇందులో 7 పూర్తిగా కొత్త మోడళ్లు కాగా 3 అప్‌డేటేడ్‌ మోడళ్లు ఉన్నాయని హెచ్‌ఎంఎ్‌సఐ ప్రెసిడెంట్‌, సీఈఓ సుము ఒటాని తెలిపారు. స్కూటర్లు, రోడ్‌స్టర్లు, క్రూయిజర్‌ బైకులు, అడ్వెంచర్‌ మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఫ్లెక్స్‌-ప్యూయల్‌ మోడళ్లు ఇందులో ఉన్నాయన్నారు. ఏడీవీ-160 సిటీ అడ్వెంచర్‌, సీబీ500, రెబెల్‌ 300, రెబెల్‌ 500, ఎక్స్‌ఆర్‌ 300ఎల్‌, ఎక్స్‌ఆర్‌ 300ఎల్‌ ర్యాలీ, క్యూసీ3 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, సీబీ350, సీబీ350సీ, సీబీ350ఆర్‌ఎస్‌ బైక్స్‌ ఈ కొత్త పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి:

క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు

‘వందనం’తో తల్లికి ఆనందం

Updated Date - Jul 25 , 2026 | 02:04 AM