Share News

శ్రీ సిటీలో హైసెన్స్‌ తయారీ ప్లాంట్‌

ABN , Publish Date - Feb 11 , 2026 | 06:09 AM

వినియోగ ఎలక్ర్టానిక్స్‌, హోమ్‌ అప్లయెన్స్‌ల రంగంలో ని హైసెన్స్‌ శ్రీసిటీలో ఇప్యాక్‌ డ్యూరబుల్‌ (ఈడీఎల్‌) భాగస్వామ్యంలో ప్లాంట్‌ను మంగళవారం...

శ్రీ సిటీలో హైసెన్స్‌ తయారీ ప్లాంట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వినియోగ ఎలక్ర్టానిక్స్‌, హోమ్‌ అప్లయెన్స్‌ల రంగంలో ని హైసెన్స్‌ శ్రీసిటీలో ఇప్యాక్‌ డ్యూరబుల్‌ (ఈడీఎల్‌) భాగస్వామ్యంలో ప్లాంట్‌ను మంగళవారం ప్రారంభించింది. ఇది దేశంలోనే ఆ కంపెనీకి తొలి తయారీ ప్లాంట్‌. శ్రీసిటీలోని ఈడీఎల్‌ ఇండస్ర్టియల్‌ పార్కులో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.273 కోట్ల పెట్టుబడితో కొత్తగా ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఈ నెలలోనే ఈ ప్లాంట్‌ వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పూర్తి స్థాయిలో పని ప్రారంభించినట్టయితే ఈ ప్లాంట్‌ హైసెన్స్‌ కోసం రూమ్‌ ఎయిర్‌ కండిషనర్లు తయారుచేయనుంది. తొలి దశలో ఏసీల ఉత్పత్తిని ప్రారంభించామని, వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో ఉత్పత్తిని ప్రారంభించనున్న రెండో దశలో వాషింగ్‌ మెషీన్లు, మూడో దశలో ఎల్‌ఈడీ టీవీల తయారీని ఈ ప్లాంట్‌ చేపడుందని హైసెన్స్‌ సీఈఓ పంకజ్‌ రాణా తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 500 మంది పని చేస్తున్నారు. వచ్చే 12-24 నెలల కాలంలో 1,500 మం దికి ఉపాధి కల్పించగలుగుతుందని పేర్కొన్నారు.

ఈ వార్తలూ చదవండి:

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

Updated Date - Feb 11 , 2026 | 06:09 AM