Share News

హీరో మోటోకార్ప్‌ రూ.1,500 కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - May 18 , 2026 | 03:12 AM

దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తన పట్టును చేజిక్కించుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హీరో మోటోకార్ప్‌...

హీరో మోటోకార్ప్‌ రూ.1,500 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తన పట్టును చేజిక్కించుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. ప్రతిపాదిత పెట్టుబడులతో స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ నెలకు 60,000 స్కూటర్లను ఉత్పత్తి చేస్తోందని, దీన్ని లక్ష యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హీరో మోటోకార్ప్‌ సీఈఓ హర్షవర్ధన్‌ చితాలే తెలిపారు. కాగా ఈ ఏడాది ముగిసే నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) తయారీని కూడా రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీ ఇప్పటికే స్కూటర్ల విభాగంలో ‘డెస్టినీ’ మోడళ్ల ఉత్పత్తిని 50 శాతం మేర పెంచగా.. ‘జూమ్‌’ స్కూటర్ల ఉత్పత్తిని రెండింతలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ఈవీ విభాగంలో ఉత్పత్తి 15,000 నుంచి 25,000 యూనిట్లకి చేరుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 03:12 AM