హీరో మోటోకార్ప్ లాభంలో 42 శాతం వృద్ధి
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:32 AM
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదిన...
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదిన రూ.1,861 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,308 కోట్ల లాభంతో పోల్చితే 42 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం కూడా 23 శాతం వృద్ధితో రూ.12,218 కోట్ల నుంచి రూ.14,971 కోట్లకు చేరుకుంది. సెప్టెంబరు త్రైమాసికంలో మొత్తం 18.68 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు విక్రయించటం కలిసివచ్చిందని తెలిపింది. స్కూటర్ విభాగం విక్రయాలు రికార్డు స్థాయిలో 47 శాతం పెరగగా వీడా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఏకంగా 76 శాతం పెరిగినట్లు హీరో మోటో వెల్లడించింది. కాగా కంపెనీ ఇదే త్రైమాసికంలో జర్మనీ మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీకిది 54వ అంతర్జాతీయ మార్కెట్.
ఇవి కూడా చదవండి...
కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
Read Latest AP News And Telugu News