మార్కెట్లోకి హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:37 AM
దేశీయ మార్కెట్లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లు వచ్చేశాయి. హీరో మోటోకార్ప్ దేశంలోనే తొలిసారిగా స్ల్పెండర్ ప్లస్, హెచ్‌ఎ్‌ఫ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లను బుధవారం విడుదల చేసింది...
స్ల్పెండర్ ప్లస్, హెచ్‌ఎ్‌ఫ డీలక్స్ విడుదల
ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లు దేశంలోనే తొలిసారి
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లు వచ్చేశాయి. హీరో మోటోకార్ప్ దేశంలోనే తొలిసారిగా స్ల్పెండర్ ప్లస్, హెచ్‌ఎ్‌ఫ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లను బుధవారం విడుదల చేసింది. ఇవి 85 శాతం వరకు ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌తో నడుస్తాయి. హెచ్‌ఎ్‌ఫ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ధర రూ.72,792, స్ల్పెండర్ ప్లస్ ఫ్లెక్స్‌ఫ్యూయల్ బైక్ ధర రూ.82,710 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వచ్చే జూలైలో ఈ బైక్‌లను ఢిల్లీ, మహారాష్ట్రలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రవేశపెడతామని, తర్వాత దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. బుధవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ రెండు బైక్‌లను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి విడుదల చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ ఇంధనాలు, పర్యావరణహిత రవాణా సాంకేతికతను స్వీకరించడంలో భారత్ వేగంగా దూసుకుపోతోందన్నారు. హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టడం..ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి, రైతుల సాధికారతకు, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ విజన్‌కు ఒక ముఖ్యమైన ముందడుగని గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. ఈ85 ఇంధనాన్ని (85ు ఇథనాల్ కలిపిన పెట్రోల్) సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఒక విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం