Share News

తగ్గిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:39 AM

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌...

తగ్గిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,322.94 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.30.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.50.99 కోట్లతో పోల్చితే 39 శాతం క్షీణించగా ఆదాయం (రూ.1,117.68 కోట్లు) మాత్రం 11 శాతం వృద్ధి చెందింది. కాగా సమీక్షా త్రైమాసికంలో పాల సేకరణ 7 శాతం పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా

ఫెయిర్‌ఫాక్స్‌ చేతికి ఐడీబీఐ బ్యాంకు

Updated Date - Oct 16 , 2026 | 05:39 AM