తగ్గిన హెరిటేజ్ ఫుడ్స్ లాభం
ABN , Publish Date - May 12 , 2026 | 03:08 AM
హెరిటేజ్ ఫుడ్స్.. గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది...
ఒక్కో షేరుకు 50 శాతం డివిడెండ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హెరిటేజ్ ఫుడ్స్.. గడచిన ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 37.26 శాతం క్షీణించి రూ.23.94 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం లాభం రూ.38.16 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం మాత్రం రూ.1,048.46 కోట్ల నుంచి రూ.రూ.1,157.56 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు కూడా రూ.990.59 కోట్ల నుంచి రూ.1,132.40 కోట్లకు పెరిగాయి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లాభం 20.26 క్షీణించి రూ.188.28 కోట్ల నుంచి రూ.150.13 కోట్లకు తగ్గింది. అయితే మొత్తం ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.4,526 కోట్లుగా నమోదైందని తెలిపింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.4,500 కోట్ల మార్కును అధిగమించటం ఇదే తొలిసారి అని పేర్కొంది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.2.5 (50 శాతం) తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత