Share News

హెరిటేజ్‌ ఫుడ్స్‌ నుంచి నరిష్+హై ప్రొటీన్‌ పెరుగు

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:37 AM

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌.. ప్రొటీన్‌ అధికంగా ఉండే తన డెయిరీ ఉత్పత్తుల నరి్‌ష+శ్రేణిని మరింతగా విస్తరించింది...

హెరిటేజ్‌ ఫుడ్స్‌ నుంచి నరిష్+హై ప్రొటీన్‌ పెరుగు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌.. ప్రొటీన్‌ అధికంగా ఉండే తన డెయిరీ ఉత్పత్తుల నరి్‌ష+శ్రేణిని మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా తాజాగా నరి్‌ష+హైప్రొటీన్‌ పెరుగును విడుదల చేసినట్టు బుధవారం ప్రకటించింది. 400 గ్రాముల ప్యాక్‌లో 25 గ్రాముల ప్రొటీన్‌ ఉన్న నరి్‌ష+హైప్రొటీన్‌ పెరుగును ప్రతి రోజూ వినియోగదారులు తమ ఆహారంలో మరింత ప్రొటీన్‌ను చేర్చుకునేలా రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది. నరి్‌ష+హైప్రొటీన్‌ పెరుగు 400 గ్రాముల కప్పు ధర రూ.75గా ఉంది. ఇది అన్ని ప్రముఖ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు, హెరిటేజ్‌ హ్యాపీనెస్‌ పాయింట్లు, ఎంపిక చేసిన ప్రీమియం జనరల్‌ ట్రేడ్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎఫ్‌డీఐలకు భారీ ఊతం!

భగ్గుమంటున్న చక్కెర ధర

Updated Date - Aug 20 , 2026 | 05:37 AM