Share News

సర్వం ఏఐలో హెచ్‌సీఎల్‌ టెక్‌కు వాటా

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:56 AM

ప్రభుత్వ మద్దతు ఉన్న సావరిన్‌ ఏఐ మోడల్‌ డెవలపర్‌ సర్వం ఏఐలో 10.46 శాతం వాటాను రూ.1,427 కోట్లకు కొనుగోలు..

సర్వం ఏఐలో హెచ్‌సీఎల్‌ టెక్‌కు వాటా

న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతు ఉన్న సావరిన్‌ ఏఐ మోడల్‌ డెవలపర్‌ సర్వం ఏఐలో 10.46 శాతం వాటాను రూ.1,427 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ వెల్లడించింది. డీల్‌లో భాగంగా సర్వం ఏఐ విలువను 150 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. ఒప్పందంపై సంతకాలు జరిగిన రెండు వారాల్లోగా ఈ లావాదేవీ ప్రక్రియ ముగుస్తుందని భావిస్తున్నారు. సర్వం ఏఐ.. దేశం కోసం సావరిన్‌ ఏఐ ఫౌండేషనల్‌ మోడల్‌ను నిర్మిస్తోంది. రీసెర్చ్‌, మోడల్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, అప్లికేషన్లతో కూడిన ఫుల్‌ స్టాక్‌ సావరిన్‌ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..

Updated Date - Jun 16 , 2026 | 01:57 AM