Share News

పదేళ్లకు రూ.945 కోట్ల అద్దె!

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:45 AM

హైదరాబాద్‌లో కార్యాలయ స్థలం లీజుకు తీసుకున్న హెచ్‌సీఏ గ్లోబల్‌, సైయెంట్‌తో 3-జీఐఎస్‌ జట్టు, భారత్‌లో టైడ్‌ రూ.3,100 కోట్ల పెట్టుబడులు...

పదేళ్లకు రూ.945 కోట్ల అద్దె!

హైదరాబాద్‌లో కార్యాలయ స్థలం లీజుకు తీసుకున్న హెచ్‌సీఏ గ్లోబల్‌

అమెరికాకు చెందిన హైల్త్‌కేర్‌ సేవల సంస్థ హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌కు చెందిన భారత అనుబంధ విభాగం, జీసీసీ అయిన హెచ్‌సీఏ గ్లోబల్‌ సర్వీసెస్‌.. హైదరాబాద్‌లోని మైండ్‌స్పే్‌సలో 6.44 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పదేళ్ల కాలానికి ప్రీ-లీజుకు తీసుకుంది. ఈ కాలానికి సంస్థ దాదాపు రూ.945 కోట్ల అద్దె చెల్లించనుంది. దేశంలో ఇప్పటివరకిదే అత్యంత విలువైన ప్రీ-లీజు అగ్రిమెంట్‌. ఈ ఒప్పందం 2027 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానుంది.

సైయెంట్‌తో 3-జీఐఎస్‌ జట్టు

హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్‌ లైఫ్‌సైకిల్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ సైయెంట్‌ లిమిటెడ్‌తో టెలికాం, యుటిలిటీ నెట్‌వర్స్‌కు నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ అందించే 3-జీఐఎస్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సైయెంట్‌ ఉత్తర అమెరికా, ఈఎంఈఏ, ఆసియా పసిఫిక్‌ మార్కెట్లలో తన ఇంజనీరింగ్‌, ఇంప్లిమెంటేషన్‌, మైగ్రేషన్‌, మేనేజ్డ్‌ సర్వీసె్‌సతోపాటు 3-జీఐఎ్‌సకు చెందిన పరిష్కారాలను సైతం ఆఫర్‌ చేయనుంది.

భారత్‌లో టైడ్‌ రూ.3,100 కోట్ల పెట్టుబడులు

భారత్‌లో తన కార్యకలాపాలను, టెక్నాలజీ కేంద్రాలను విస్తరించేందుకు వచ్చే నాలుగేళ్లలో 25 కోట్ల పౌండ్ల (సుమారు రూ.3,100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు యూకేకు చెందిన బిజినెస్‌ ఫైనాన్షియల్‌ ప్లాట్‌ఫామ్‌ టైడ్‌ బుధవారం ప్రకటించింది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)ను నిర్వహిస్తోంది. ఈ కేంద్రంలో దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మిధానీ లాభం రూ.27.69 కోట్లు

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ) నికర లాభం వార్షిక ప్రాతిపదికన 116.84 శాతం వృద్ధితో రూ.27.69 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రూ.295.91 కోట్ల టర్నోవర్‌ను సాధించింది.

(ఆంధ్రజ్యోతి బిజినెస్‌)

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!

కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?

Updated Date - Nov 12 , 2026 | 05:46 AM