మార్కెట్లోకి గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 వీడియో గేమ్
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:55 AM
ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన...
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన ‘గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 (జీటీఏ 6)’ వీడియో గేమ్ గురువారం అట్టహాసంగా విడుదలైంది. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ప్లేస్టేషన్ 5 (పీఎస్5), ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ వేదికలపై ఈ సింగిల్ ప్లేయర్ గేమ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో గేమింగ్ పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద గేమింగ్ విడుదలగా నిలిచింది. భారత్‌లో ప్లేస్టేషన్, ఎక్స్ బాక్స్ డిజిటల్ స్టోర్లలో ఈ గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6 స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.5,999, అల్టిమేట్ ఎడిషన్ ధర రూ.7,499గా నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..