జీఎస్‌టీ వసూళ్లు రూ.1.93 లక్షల కోట్లు
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:30 AM
జనవరి నెలలో వస్తు, సేవల పన్ను(జీఎ్‌సటీ) స్థూల వ సూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.2 శాతం పెరుగుదలతో మూడు నెల ల గరిష్ఠ స్థాయి రూ.1.93 లక్షల కోట్లకు చేరాయి.
జనవరిలో 6.2 శాతం వృద్ధి నమోదు
న్యూఢిల్లీ: జనవరి నెలలో వస్తు, సేవల పన్ను(జీఎ్‌సటీ) స్థూల వ సూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.2 శాతం పెరుగుదలతో మూడు నెల ల గరిష్ఠ స్థాయి రూ.1.93 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు ఫలితంగా మార్కెట్లో పుంజుకున్న వినియోగం ప్రభుత్వానికి తగ్గిన ఆదాయాన్ని క్రమంగా భర్తీ చేస్తోందనడానికిది సంకేతమని విశ్లేషకులు పేర్కొన్నారు. గత నెలలో జీఎ్‌సటీ రిఫండ్లు మాత్రం 3.1 శాతం తగ్గి రూ.22,665 కోట్లకు పరిమితమయ్యాయి. దాంతో, జీఎ్‌సటీ నికర వసూళ్లు రూ.1.71 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2025 జనవరిలో నికర జీఎ్‌సటీ ఆదాయంతో పోలిస్తే 7.6 శాతం వృద్ధి నమోదైంది. ఈ జనవరిలో దేశీయ లావాదేవీల ద్వారా జీఎ్‌సటీ స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.8 శాతం వృద్ధితో రూ.1.41 లక్షల కోట్లకు పెరిగింది. దిగుమతులపై పన్ను ఆదాయం 10.1 శాతం పెరిగి రూ.52,253 కోట్లకు చేరింది.
ఇవీ చదవండి:
ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్
2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..