GST Collections: జీ ఎస్ టీ వసూళ్లు రయ్ రయ్
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:30 AM
జీఎ్‌సటీ రేట్లు గత సెప్టెంబరులో తగ్గించినా, ఆ ప్రభావం పన్ను వసూళ్లపై ఏ మాత్రం కనిపించడం లేదు....
రూ.1.74 లక్షల కోట్లకు చేరిక
న్యూఢిల్లీ: జీఎ్‌సటీ రేట్లు గత సెప్టెంబరులో తగ్గించినా, ఆ ప్రభావం పన్ను వసూళ్లపై ఏ మాత్రం కనిపించడం లేదు. డిసెంబర్ నెలలో దేశ వ్యాప్తంగా రూ.1,74,550 కోట్లు జీఎ్‌సటీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరాయి. 2024 డిసెంబర్‌లో నమోదైన రూ.1.64 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.1ు ఎక్కువ.
తెలంగాణాలో డీలా : డిసెంబర్ నెలలో తెలంగాణలో జీఎ్‌సటీ వసూళ్లు నీరసించాయి. 2024 డిసెంబర్ లో రూ.1,817 కోట్లుగా ఉన్న వసూళ్లు ఈ డిసెంబరులో మూడు శాతం తగ్గి రూ.1,762 కోట్లకు పడిపోయాయి.
ఇవి కూడా చదవండి
ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా...?
బేకింగ్ సోడా vs బేకింగ్ పౌడర్.. వీటిని ఎప్పుడు ఉపయోగించాలి