జీఎస్‌టీ వసూళ్లు రూ.1.83 లక్షల కోట్లు
ABN , Publish Date - Mar 02 , 2026 | 02:04 AM
జీఎస్‌టీ వసూళ్లలో జోరు కొనసాగుతోంది. ఫిబ్రవరిలో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.83 లక్షల కోట్లకు చేరా యి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే...
న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లలో జోరు కొనసాగుతోంది. ఫిబ్రవరిలో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.83 లక్షల కోట్లకు చేరా యి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. దిగుమతులతో పాటు దేశీయ అమ్మకాల వృద్ధి ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశీయ అమ్మకాలపై వసూళ్లు 5.3 శాతం పెరిగి రూ.1.36 లక్షల కోట్లకు, దిగుమతి సుంకాల వసూళ్లు 17.2 శాతం పెరిగి రూ.47,837 కోట్లకు చేరాయి. ఇదే కాలంలో జీఎ్‌సటీ రిఫండ్స్ 10.2 శాతం పెరిగి రూ.22,595 కోట్లకు చేరాయి. దీంతో ఫిబ్రవరి నికర జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.61 లక్షలుగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు
ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం