జీఎస్‌టీ వసూళ్లలో సరికొత్త రికార్డు
ABN , Publish Date - May 02 , 2026 | 05:34 AM
ఏప్రిల్ నెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 8.7 శాతం వృద్ధితో సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.2.43 లక్షల కోట్లకు పెరిగాయి. దిగుమతులపై...
ఏప్రిల్‌లో రూ.2.43 లక్షల కోట్లుగా నమోదు
దిగుమతులపై పన్ను ఆదాయంలో 26ు వృద్ధి
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 8.7 శాతం వృద్ధితో సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.2.43 లక్షల కోట్లకు పెరిగాయి. దిగుమతులపై పన్ను ఆదాయంలో భారీ వృద్ధి ఇందుకు దోహదపడిందని శుక్రవారం విడుదల చేసిన డేటాలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారినప్పటికీ, దేశీయ ఆర్థిక కార్యకలాపాల్లో జోరును ఈ గణాంకాను ప్రతిబింబిస్తున్నాయి. జీఎ్‌సటీ వసూళ్లలో క్రితం రికార్డు గత ఏడాది ఏప్రిల్‌లో రూ.2.23 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ ఏప్రిల్‌లో దేశీయ లావాదేవీల ద్వారా స్థూల పన్ను వసూళ్లు 4.3 శాతం పెరిగి రూ.1.85 లక్షల కోట్లను మించాయి. దిగుమతులపై జీఎ్‌సటీ ఆదాయం ఏకంగా 25.8 శాతం పెరిగి రూ.57,580 కోట్లకు చేరుకుంది.
నికర వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు: ఈ ఏప్రిల్‌లో జీఎస్‌టీ రిఫండ్లు వార్షిక ప్రాతిపదికన 19.3 శాతం పెరుగుదలతో రూ.31,793 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లు మినహాయించగా జీఎ్‌సటీ నికర ఆదాయం రూ.2.11 లక్షల కోట్లుగా ఉంది. గత ఏప్రిల్‌తో పోలిస్తే 7.3 శాతం అధికమిది.
గత సెప్టెంబరులో భారీ సంస్కరణలు: మార్కెట్లో వస్తు ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2025 సెప్టెంబరులో 375 ఉత్పత్తులపై జీఎ్‌సటీని తగ్గించింది. అలాగే, 5,12,18,28 శాతంగా ఉన్న జీఎస్‌టీ శ్లాబులను కేవలం 5,18 శాతానికి కుదించింది. పొగాకు ఉత్పత్తులు, అత్యంత విలాస వస్తువులను మాత్రం 40 శాతం పన్ను శ్లాబులో చేర్చింది. జీఎస్‌టీ తగ్గింపుతో తొలుత జీఎస్‌టీ ఆదాయానికి కొంత గండిపడినప్పటికీ, వసూళ్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
గతనెలలో వసూళ్లు (రూ.కోట్లు)
సెంట్రల్ జీఎస్‌టీ 52,140
స్టేట్ జీఎ్‌సటీ 61,331
ఐజీఎస్‌టీ 1,29,232
మొత్తం 2,42,702
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ