Share News

గ్రాన్యూల్స్‌ లాభం రూ.180 కోట్లు

ABN , Publish Date - Jul 22 , 2026 | 02:15 AM

ఈ ఆర్థిక సంవత్సరం(2026-27)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం(క్యూ1)లో హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ..

గ్రాన్యూల్స్‌ లాభం రూ.180 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఈ ఆర్థిక సంవత్సరం(2026-27)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం(క్యూ1)లో హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.180 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఇదే కాలానికి ఆర్జించిన రూ.112.6 కోట్ల లాభంతో పోలిస్తే 60 శాతం వృద్ధి కనబరిచింది. కాగా, ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 22శాతం పెరిగి రూ.1,477 కోట్లకు చేరుకుంది. 2025-26లో ఇదే సమయానికి రాబడి రూ.1,210 కోట్లుగా ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి:

ప్రభుత్వ అధీనంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!

Updated Date - Jul 22 , 2026 | 02:15 AM