Share News

గ్రాన్యూల్స్‌ లాభం రూ.202 కోట్లు

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:32 AM

గ్రాన్యూల్స్‌ ఇండియా.. గడచిన ఆర్ఖిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో...

గ్రాన్యూల్స్‌ లాభం రూ.202 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రాన్యూల్స్‌ ఇండియా.. గడచిన ఆర్ఖిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,470.60 కోట్ల ఆదాయంపై రూ.201.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 23 శాతం పెరగగా లాభం 33 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయంలో అమెరికా వాటా 72 శాతంగా ఉండగా యూరప్‌ వాటా 17 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..

Updated Date - Apr 30 , 2026 | 04:32 AM