Share News

నేడే బీహెచ్‌ఈఎల్‌ వాటాల విక్రయం

ABN , Publish Date - Feb 11 , 2026 | 05:50 AM

ప్రభుత్వ రంగానికి చెందిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌లో (బీహెచ్‌ఈఎల్‌) కేంద్రం 5 శాతం వరకు వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించనుంది. ఒక్కో షేరు కనీస ధరను...

నేడే బీహెచ్‌ఈఎల్‌ వాటాల విక్రయం

  • ఒక్కో షేరు ధర రూ.254

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌లో (బీహెచ్‌ఈఎల్‌) కేంద్రం 5 శాతం వరకు వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించనుంది. ఒక్కో షేరు కనీస ధరను రూ.254గా నిర్ణయించారు. బీఎ్‌సఈలో మంగళవారం బీహెచ్‌ఈఎల్‌ షేరు ముగింపు ధర రూ.276.05తో పోలిస్తే ఈ ధర 8ు తక్కువ. ఈ ఇష్యూ నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లకు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు గురువారం నుంచి బిడ్‌ చేయవచ్చని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి అరునిష్‌ చావ్లా మంగళవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వాటా విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.4,422 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్‌లో ప్రభుత్వం 63.17 శాతం వాటా కలిగి ఉంది. ఓఎ్‌ఫఎస్‌ అనంతరం 58.17 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కాగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈక్విటీ వాటాల విక్రయం ద్వారా మోదీ సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.8,768 కోట్లు సమీకరించింది.

ఈ వార్తలూ చదవండి:

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

Updated Date - Feb 11 , 2026 | 05:50 AM