క్లెయిమ్ చేయని డిపాజిట్ల కోసం ప్రత్యేక పోర్టల్
ABN , Publish Date - May 30 , 2026 | 02:39 AM
బ్యాంకు డిపాజిట్లు, బీమా క్లెయిమ్‌లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు క్లెయిమ్ చేయడం మర్చిపోయారా? డోంట్ వర్రీ. మీ ఆధార్, పాన్ వంటి వివరాలు ఉంటే చాలు...
ప్రారంభించిన ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లు, బీమా క్లెయిమ్‌లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు క్లెయిమ్ చేయడం మర్చిపోయారా? డోంట్ వర్రీ. మీ ఆధార్, పాన్ వంటి వివరాలు ఉంటే చాలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఠుఽఛిజ్చూజీఝ్ఛఛ్చీటట్ఛ్టటఞౌట్ట్చజూ.జీుఽ అనే పోర్టల్ ద్వారా వాటి ఆచూకీ కనిపెట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ఆర్థిక సేవల విభాగం (డీఎ్‌ఫఎస్) కార్యదర్శి ఎం నాగరాజు ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. పీఎ్‌సబీ అలయెన్స్‌తో కలిసి ఆర్థిక సేవల విభాగం ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. ఆర్థిక ఆస్తుల వివరాలు మర్చిపోయిన మదుపరులకు ఈ పోర్టల్ ఉపయోపడనుంది.
ఈ వార్తలనూ చదవండి:
మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ
తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు