Share News

2026-27లో రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్‌

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:24 AM

వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ), జాతీయ బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ నుంచి రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్‌...

2026-27లో రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్‌

వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ), జాతీయ బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ నుంచి రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్‌ వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం (రూ.3.05 లక్షల కోట్లు)తో పోల్చితే ఇది 3.75 శాతం ఎక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్ధలు ప్రభుత్వానికి అందించిన డివిడెండ్‌ రూ.2.56 లక్షల కోట్లుగా ఉంది. కాగా ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎ్‌సఈ), ఇతర పెట్టుబడుల రూపంలో రూ.75,000 కోట్ల వరకు డివిడెండ్‌ అందుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవీ చదవండి:

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

Updated Date - Feb 02 , 2026 | 06:27 AM