Share News

దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లకు

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:44 AM

దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక మూలధన లాభార్జన పన్ను (ఎల్‌టీసీజీ)ను రద్దు చేసే ప్రతిపాదన ఏమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ ఫోర్ట్‌ఫోలియో..

దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లకు

ఎల్‌టీసీజీ మినహాయింపు ప్రతిపాదనేం లేదు

  • స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక మూలధన లాభార్జన పన్ను (ఎల్‌టీసీజీ)ను రద్దు చేసే ప్రతిపాదన ఏమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎ్‌ఫపీఐ) పెట్టుబడులకు ఎల్‌టీసీజీ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఆర్థిక శాఖ గత నెలలో ప్రకటించింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లకూ ఎల్‌టీసీజీ నుంచి ఊరట కల్పిస్తారా అని లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు అలాంటి ఆలోచనేమీ లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదురి సమాధానమిచ్చారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై దేశీయ ఇన్వెస్టర్లతో పాటు ఎఫ్‌పీఐలు కూడా 12.5 శాతం ఎల్‌టీసీజీ చెల్లించాల్సి ఉంటుందని చౌదురి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 05:44 AM