భారత్‌లో అత్యంత ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్ గూగుల్
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:27 AM
మన దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్ నిలిచింది. ఈ కంపెనీ తర్వాత రెండో స్థానంలో టాటా గ్రూప్, మూడో స్థానంలో అమెజాన్...
తర్వాతి స్థానాల్లో టాటా గ్రూప్, అమెజాన్
రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: మన దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్ నిలిచింది. ఈ కంపెనీ తర్వాత రెండో స్థానంలో టాటా గ్రూప్, మూడో స్థానంలో అమెజాన్ నిలిచాయి. ఈ మేరకు బుధవారం రాండ్‌స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2026 నివేదిక వెలువడింది. 34 మార్కెట్లలోని 1.75 లక్షల మందికి పైగా, భారత్‌లోని దాదాపు 3,500 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం.. 46 శాతం మంది భారతీయ ఉద్యోగులు వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగం మారాలనుకుంటున్నారు. 32 శాతం మంది గత ఆరు నెలల్లో తమ సంస్థను మార్చుకున్నారు. భారతీయ ఉద్యోగులు ప్రధానంగా పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత, సమాన అవకాశాలు, కెరీర్‌లో ఎదుగుదల, ఆకర్షణీయమైన జీతభత్యాలు, సంస్థకున్న మంచి పేరు వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వే ప్రకారం వెల్లడైంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తూ భారత్ ఆర్థికంగా మరింత బలపడుతున్నందున ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా తమ టాలెంట్ వ్యూహాలను మార్చుకునే సంస్థలే ఉద్యోగులను ఆకర్షించడంలో, వారిని నిలుపుకోవడంలో ముందుంటాయని రాండ్‌స్టడ్ ఇండియా ఎండీ నారాయణ్ అయ్యర్ పేర్కొన్నారు.
టాప్ 10 కంపెనీలు
1. గూగుల్
2. టాటా గ్రూప్
3. అమెజాన్
4. సామ్‌సంగ్ ఇండియా
5. ఇన్ఫోసిస్
6. రిలయన్స్ ఇండస్ర్టీస్
7. ఐటీసీ గ్రూప్
8. హిందుస్థాన్ యూనిలీవర్
9. మహీంద్రా అండ్ మహీంద్రా
10.డెల్ టెక్నాలజీస్
ఇవీ చదవండి:
ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం