గోల్డ్ రేట్.. పైపైకి! వరుసగా రెండో రోజూ ధరల్లో పెరుగుదల
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:36 AM
దేశంలో బంగారం ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. ధరలు పెరగడం వరుసగా ఇది రెండో రోజు. మరి పసిడి, వెండి తాజా రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న వేళ నిన్న (శుక్రవారం) బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. భారత్‌లో మేలిమి బంగారం ధర సగటున రూ.850ల మేర పెరిగింది. అంతకుముందు రోజున పసిడి రేట్లు ఏకంగా రూ.2200ల మేర పెరిగిన విషయం తెలిసిందే (Gold, Silver Rates on Feb 21).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం స్పాట్ ధర రూ.1,57,370కు చేరింది. నిన్నటితో పోలిస్తే ధర రూ.880ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.800ల మేర పెరిగి రూ.1,44,250కు చేరింది. నగరంలో వెండి ధరలు మాత్రం నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,69,900గా ఉంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ బంగారం స్పాట్ ధర 5,108 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి 84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్లుతున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు
చెన్నై: ₹1,57,300; ₹1,44,190
ముంబై: ₹1,57,380; ₹1,44,260
న్యూఢిల్లీ: ₹1,57,530; ₹1,44,410
కోల్‌కతా: ₹1,57,380; ₹1,44,260
బెంగళూరు: ₹1,57,380; ₹1,44,260
హైదరాబాద్: ₹1,57,380; ₹1,44,260
విజయవాడ: ₹1,57,380; ₹1,44,260
కేరళ: ₹1,57,380; ₹1,44,260
పుణె: ₹1,57,380; ₹1,44,260
వడోదరా: ₹1,57,430; ₹1,44,310
అహ్మదాబాద్: ₹1,57,430; ₹1,44,310
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹2,69,980
ముంబై: ₹2,69,900
న్యూఢిల్లీ: ₹2,69,910
కోల్‌కతా: ₹2,69,900
బెంగళూరు: ₹2,69,890
హైదరాబాద్: ₹2,69,900
విజయవాడ: ₹2,69,900
కేరళ: ₹2,69,900
పుణె: ₹2,69,900
వడోదరా: ₹2,69,850
అహ్మదాబాద్: ₹2,69,920
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలూ చదవండి:
ట్రంప్ సుంకాలను కొట్టేసిన అమెరికా సుప్రీం కోర్టు.. భారత్‌కు ఊరట