భగ్గుమన్న పసిడి ధర! రూ.3 లక్షల మార్కును చేరిన వెండి
ABN , Publish Date - Feb 23 , 2026 | 10:10 AM
సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర రూ.2 వేల మేర పెరగ్గా వెండి రూ.25 వేల మేర పెరిగి రూ.3 లక్షల మార్కును దాటింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, భారత్‌లో సోమవారం 10.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,350కు చేరింది. నిన్నటితో పోలిస్తే రేటు ఏకంగా రూ.2,070ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ.1,900ల మేర పెరిగి రూ.1,47,900కు చేరింది. వెండి ధర కూడా అమాంతం పెరిగింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర ఏకంగా రూ.25 వేల మేర పెరిగి రూ.3 లక్షలకు చేరుకుంది (Gold, Silver Rates in India on Feb 23).
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు
చెన్నై: ₹1,62,110; ₹1,48,600
ముంబై: ₹1,61,350; ₹1,47,900
ఢిల్లీ: ₹1,61,500; ₹1,48,050
కోల్‌కతా: ₹1,61,350; ₹1,47,900
బెంగళూరు: ₹1,61,350; ₹1,47,900
హైదరాబాద్: ₹1,61,350; ₹1,47,900
విజయవాడ: ₹1,61,350; ₹1,47,900
కేరళ: ₹1,61,350; ₹1,47,900
పుణె: ₹1,61,350; ₹1,47,900
వడోదరా: ₹1,61,400; ₹1,47,950
అహ్మదాబాద్: ₹1,61,400; ₹1,47,950
కిలో వెండి ధరలు
చెన్నై: ₹3,00,000
ముంబై: ₹3,00,000
ఢిల్లీ: ₹2,98,000
కొలకతా: ₹2,98,900
బెంగళూరు: ₹3,00,000
హైదరాబాద్: ₹3,00,000
విజయవాడ: ₹3,00,000
కేరళ: ₹2,89,900
పుణె: ₹3,00,000
అహ్మదాబాద్: ₹2,94,000
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలూ చదవండి:
ఒడిశాలో ఆర్‌బీఐ రెండో డేటా కేంద్రం
కాకినాడ పెన్సిలిన్-జీ ప్లాంట్‌లో 10 వేల టన్నులకు ఉత్పత్తి