పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవీ
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:50 AM
గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం వంటివి ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చ్ 19) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,740గా ఉంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,45,690 వద్ద తచ్చాడుతోంది. కిలో వెండి రూ.2,74,900ల వద్ద కొనసాగుతోంది (Gold, Silver Rates on March 19).
ఈ వారం ఇప్పటివరకూ హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1900 మేర తగ్గింది. 22 క్యారెట్ పసిడి ధరలో రూ.1700 మేర కోత పడింది. కిలో వెండి ధర రూ.5 వేల మేర పడిపోయింది. అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు
చెన్నై: ₹1,58,940; ₹1,45,690;
ముంబై: ₹1,57,740; ₹1,44,590;
న్యూఢిల్లీ: ₹1,57,890; ₹1,44,740;
కోల్‌కతా: ₹1,57,740; ₹1,44,590;
బెంగళూరు: ₹1,57,740; ₹1,44,590;
హైదరాబాద్: ₹1,57,740; ₹1,44,590;
విజయవాడ: ₹1,57,740; ₹1,44,590;
కేరళ: ₹1,57,740; ₹1,44,590;
పుణె: ₹1,57,740; ₹1,44,590;
వడోదరా: ₹1,57,790; ₹1,44,640;
అహ్మదాబాద్: ₹1,57,790; ₹1,44,640;
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,74,900;
ముంబై: ₹2,64,900;
న్యూఢిల్లీ: ₹2,64,900;
కోల్‌కతా: ₹2,64,900;
బెంగళూరు: ₹2,64,900;
హైదరాబాద్: ₹2,74,900;
విజయవాడ: ₹2,74,900;
కేరళ: ₹2,74,900;
పుణే: ₹2,64,900;
వడోదరా: ₹2,64,900;
అహ్మదాబాద్: ₹2,64,900;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఈ వార్తలూ చదవండి:
దేశంలో తయారీ రంగానికి ప్రోత్సాహం.. రూ.33,660 కోట్లతో భవ్య
స్టాక్ మార్కెట్ సంపద.. 3 రోజుల్లో రూ.9.18 లక్షల కోట్లు