Gold, Silver Rates on Jan 20: ఒక్కసారిగా పెరిగిన పసిడి, వెండి ధరలు! ఎంతో తెలిస్తే..
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:27 PM
మంగళవారం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల నేపథ్యంలో వెండి ధర ఏకంగా రూ.12వేల మేర పెరిగి రూ.3.30 లక్షలకు చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు పసిడి, వెండి రేట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం భారీగా పెరిగిన ధరలు మంగళవారం కూడా ర్యాలీని కొనసాగించాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1040 మేర పెరిగి రూ.1,47,280ల రికార్డు స్థాయికి చేరింది. 22 క్యారెట్‌ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.1,35,000కు ఎగబాకింది. నగరంలో వెండి ధర కూడా చుక్కలనంటింది. ఒక్కరోజులో ఏకంగా రూ. 12 వేల మేర పెరిగి రూ.3,30,000కు చేరుకుంది (Gold, Silver Rates on Jan 20).
వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు
చెన్నై: ₹1,48,480; ₹1,36,100;
ముంబై: ₹1,47,280; ₹1,35,000;
న్యూఢిల్లీ: ₹1,47,430; ₹1,35,150;
కోల్‌కతా: ₹1,47,280; ₹1,35,000;
బెంగళూరు: ₹1,47,280; ₹1,35,000;
హైదరాబాద్: ₹1,47,280; ₹1,35,000;
విజయవాడ: ₹1,47,280; ₹1,35,000;
కేరళ: ₹1,47,280; ₹1,35,000;
పుణె: ₹1,47,280; ₹1,35,000;
వడోదరా: ₹1,47,330; ₹1,35,050;
అహ్మదాబాద్: ₹1,47,330; ₹1,35,050;
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹3,30,000
ముంబై: ₹3,15,000
న్యూఢిల్లీ: ₹3,15,000
కోల్‌కతా: ₹3,15,000
బెంగళూరు: ₹3,15,000
హైదరాబాద్: ₹3,30,000
విజయవాడ: ₹3,30,000
కేరళ: ₹3,30,000
పుణె: ₹3,15,000
వడోదరా: ₹3,15,000
అహ్మదాబాద్: ₹3,15,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
భారత్ వృద్ధి రేటు 7.3 శాతం.. ఐఎమ్ఎఫ్ అంచనా
మార్కెట్‌ను ముంచిన టారిఫ్ భయాలు