Share News

స్థిరంగా పసిడి, వెండి ధరలు

ABN , Publish Date - Mar 21 , 2026 | 10:41 AM

భారత్‌లో ప్రస్తుతం పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా పసిడి, వెండి ధరలు
Gold, Silver prices in India on March 21

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నిన్నటి వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు యథాతథ స్థితిలో కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం (మార్చ్ 21) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900ల వద్ద కొనసాగుతోంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,36,540ల వద్ద కదలాడుతోంది. వెండి ధర కూడా దాదాపుగా నిన్నటి ముగింపు స్థాయి వద్దే కొనసాగుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,59,900గా ఉంది.


చెన్నైలో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,52,190గా ఉంది. ఢిల్లీలో మేలిమి బంగారం ధర రూ.1,49,050 వద్ద కదలాడుతోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో ధర రూ.1,48,900గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,510గా, ఢిల్లీలో రూ.1,36,690గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,36,540 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం చెన్నైలో కిలో వెండి ధర రూ.2,59,900గా ఉంది. ఇతర నగరాల్లో రూ.2.5 లక్షల వద్ద కదలాడుతోంది.


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఈ వార్తలూ చదవండి:

ఈద్-ఉల్-ఫితర్.. నేడు బ్యాంకులకు సెలవు

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం

Updated Date - Mar 21 , 2026 | 11:37 AM