బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల!
ABN , Publish Date - Feb 21 , 2026 | 10:07 AM
భారత్‌లో శనివారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మరి వివిధ నగరాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఇవాళ(శనివారం) బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. మేలిమి బంగారం రేటు ఏకంగా రూ.1,900ల మేర పెరిగింది. బంగారం ధరల్లో పెరుగుదల నమోదు కావడం వరుసగా ఇది మూడోసారి. గత రెండు రోజుల్లో ధర సుమారు రూ.3 వేల మేర పెరిగింది (Gold, Silver Rates on Feb 21).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,280 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ధర ఏకంగా రూ.1,910ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,750ల మేర పెరిగి రూ.1,46,000కు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా భగ్గుమన్నాయి. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.20 వేల మేర పెరిగి రూ.2,90,000కు చేరుకుంది.
చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.1,60,150కు చేరింది. న్యూఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,59,430గా, ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,59,280గా ఉంది. ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,75,000గా ఉంది. ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లోనూ ఇదే ధర ఉంది. చెన్నైలో గరిష్ఠంగా కిలో వెండి రూ.2,90,000కు చేరుకుంది.
ఈ వార్తలూ చదవండి
త్వరలో అమల్లోకి రానున్న పాన్ కార్డు నిబంధనలు ఇవేనా!
పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ