Share News

తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 06:32 AM

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు గురువారం ఒక్కసారిగా పెరిగాయి. మరి తాజా రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold, Silver Rates on Feb 20

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నిన్న (గురువారం) బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతకుముందు రెండు రోజుల పాటు దిద్దుబాటుకు గురైన ధరలు పుంజుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత ఉంటుందన్న అంచనాలు పెరగడంతో ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి (Gold, Silver Prices on Feb 20).

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,500గా ఉంది. నిన్న ఇదే సమయానికి ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు రూ.2,230 మేర పెరిగింది. 22 క్యారెట్ 10 గ్రాముల ధర కూడా రూ.2,110 మేర పెరిగి రూ.1,43,460కు చేరుకుంది. ఇక నగరంలో వెండి ధర కూడా రూ.10 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,70,100గా ఉంది.

నేడు విడుదల కానున్న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన సమావేశం తాలూకు వివరాల ప్రభావం ట్రేడింగ్‌పై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో విడుదల కానున్న అమెరికా జీడీపీ నాలుగవ త్రైమాసిక ఫలితాలకు అనుగుణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి.


దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు

  • చెన్నై: ₹1,58,190; ₹1,45,010

  • ముంబై: ₹1,56,500; ₹1,43,460

  • న్యూఢిల్లీ: ₹1,56,650; ₹1,43,610

  • కోల్‌కతా: ₹1,56,500; ₹1,43,460

  • బెంగళూరు: ₹1,56,500; ₹1,43,460

  • హైదరాబాద్: ₹1,56,500; ₹1,43,460

  • విజయవాడ: ₹1,56,500; ₹1,43,460

  • కేరళ: ₹1,56,500; ₹1,43,460

  • పుణె: ₹1,56,500; ₹1,43,460

  • వడోదరా: ₹1,56,550; ₹1,43,510

  • అహ్మదాబాద్: ₹1,56,550; ₹1,43,510

వెండి (కిలో) ధరలు ఇవీ

  • చెన్నై: ₹2,70,200

  • ముంబై: ₹2,70,100

  • ఢిల్లీ: ₹2,70,110

  • కోల్‌కతా: ₹2,70,100

  • బెంగళూరు: ₹2,70,100

  • హైదరాబాద్: ₹2,70,100

  • విజయవాడ: ₹2,70,100

  • కేరళ: ₹2,70,000

  • పుణె: ₹2,70,100

  • వడోదరా: ₹2,70,000

  • అహ్మదాబాద్: ₹2,70,100


గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.

ఈ వార్తలూ చదవండి:

ఓపెన్‌ ఏఐతో టాటా జట్టు

‘ఎన్‌సీసీ’పై ఎన్‌హెచ్‌ఏఐ వేటు

Updated Date - Feb 20 , 2026 | 07:13 AM